తుది దశ ట్రయిల్స్ కు చేరుకున్న చైనా వ్యాక్సిన్..

తుది దశ ట్రయిల్స్ కు చేరుకున్న చైనా వ్యాక్సిన్..

మహమ్మారి కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 17 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే రెండు సంస్థల వ్యాక్సిన్లు తుది దశ ఘట్టానికి చేరుకున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు చైనా కూడా వచ్చి చేరింది. చైనాకు చెందిన సైనోవాక్.. కోవిడ్ వ్యాక్సిన్ యొక్క 1, 2 ఫేజ్ లను దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపింది. దీంతో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్టాజెన్కాతో పాటు సైనోవాక్ కూడా ఫేజ్ 3 ట్రయిల్స్ కు చేరుకున్నాయి.

ఈ ట్రయిల్స్ బ్రెజిల్ లో చేపడతామని, ఇందుకోసం అవసరమైన వలంటీర్ల ఎంపిక కార్యక్రమం కూడా ఈ నెలలోనే ఉంటుందని సంస్థ తెలిపింది. మానవులపై పరీక్షలకు సంబంధించి టీకాల వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉన్నాయో లేదో ఫేజ్ 1,2ల్లో తేలిపోతుంది. ఫేజ్ 3లో వ్యాక్సిన్ వల్ల ఆశించిన ఫలితాలు వస్తున్నాయా లేదా అని నిర్ధారిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story