అంతర్జాతీయం

కరోనా ఎఫెక్ట్.. కువైట్ లో ఉన్న భారతీయులు..

కరోనా ఎఫెక్ట్.. కువైట్ లో ఉన్న భారతీయులు..
X

కువైట్ దేశ జనాభా 48 లక్షలు ఉంటే అందులో విదేశీయులే 34 లక్షల మంది ఉన్నారు. ఇక భారతీయుల సంఖ్య 8 లక్షల మంది. కరోనా వల్ల కువైట్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరోవైపు దేశంలో పెరుగుతున్న విదేశీయులను తగ్గించే క్రమంలో చర్యలు తీసుకుంటోంది. విదేశీయుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ఆ దేశ ప్రదాని షేక్ సబా అల్ ఖలీదా అల్ సబా చూస్తున్నారు.

ఇందుకు సంబంధించి కువైట్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)కి చెందిన చట్టసభ్యుల కమిటీ విదేశీ జనాభా తగ్గింపునకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించింది. బిల్లును ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఆమోదిస్తే సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్ ను వీడాల్సి ఉంటుంది. భారతీయులు ఎక్కువగా ఉపాధి నిమిత్తం కువైట్ తో పాటు గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. మరోవైపు మిగతా గల్ఫ్ దేశాలు కూడా కువైట్ మార్గాన్ని అనుసరించాలని చూస్తున్నాయి.

Next Story

RELATED STORIES