ఇండియన్స్ డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్‌ సీఈవో!

ఇండియన్స్ డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్‌ సీఈవో!

ఇండియా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. దీనికి ప్రధాన కారణం దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుగా ఉండటం. అయితే ఇండియా నిషేధం విధించిన యాప్‌లో టిక్ టాక్ ఒకటి. టిక్ టాక్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల యూజర్లలో 11 కోట్ల మంది భారతీయులే. అయితే చైనా దేశపు యాప్‌‌ల నుంచి యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేఫద్యంలో ఆ దేశపు యాప్ లను ఇండియా బ్యాన్ చేసింది.

అయితే ఈ ఘటనపై టిక్ టాక్ సీఈవో కెవిన్ మేయర్ స్పందించారు. చైనా ఎప్పుడూ భారతీయుల డేటా గురించి అడగలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కంపెనీకి ఎప్పుడూ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు.

అయితే భారతీయులకు సంబంధించిన డేటా అంతా సింగపూర్‌లో ఉన్న సర్వర్లలో ఉందని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. అలాగే ఈ సంస్థ భారతదేశంలోనూ డేటా సెంటర్లను నిర్మించాలనుకుంటుందని సీఈవో కెవిన్‌ మేయర్‌ లేఖ ద్వారా ఇండియాకు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story