క్వారంటైన్ లో ఉండలేక బాలుడు ఆత్మహత్య

క్వారంటైన్ లో ఉండలేక బాలుడు ఆత్మహత్య
X

క్వారంటైన్ లో ఉండలేక ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని

ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. సాలిగ్రామాకు చెందిన మహిళ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. అయితే ఆ కుటుంబంలో ఒకరికి ఇటీవల కరోనా సోకింది. దాంతో ఆమె తన 15 ఏళ్ల బాలుడితో కలిసి ఇంటి నిర్బంధంలో ఉంటున్నారు. అయితే పదవ తరగతి చదువుతున్న బాలుడు క్వారంటైన్ లో ఉండటానికి ఇష్టపడలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండటం మూలాన అతను ఇంట్లో ఉండలేకపోయాడు.

దాంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు బుధవారం తెలిపాయి. బాలుడు మంగళవారం బయటకు వెళ్ళడానికి అనుమతించకపోవడంతో నిరాశతో తీవ్ర చర్య తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Next Story

RELATED STORIES