15 రోజులకు రూ.12 లక్షల బిల్లు.. అయినా చివరికి..

15 రోజులకు రూ.12 లక్షల బిల్లు.. అయినా చివరికి..

రూ.12 లక్షల బిల్లా. యాడనుంచి కట్టేది సారు. ఇప్పటికే ఉన్న పొలం కాస్తా అమ్మి కట్టినం. ఇంకెక్కడి నుంచి తేవాల. ఇంత కట్టినా బిడ్డ బతికిండా అదీ లేదు అని యువకుని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యాదగిరి గుట్టకు చెందిన ఓ యువకుడు కరోనా లక్షణాలతో గత నెల 23న సికింద్రాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. 24న కరోనా టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. మళ్లీ రెండ్రోజుల తర్వాత 26న టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. దాంతో అక్కడే ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రి బిల్లు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఊళ్లో ఉన్న పొలం అమ్మి అప్పటికీ రూ.6.50 లక్షలు కట్టారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆ యువకుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. మొత్తం బిల్లు రూ.12 లక్షలు అయింది. బ్యాలెన్స్ కట్టి బాడీని తీస్కెళ్లమని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పొలం అమ్మి డబ్బులు కట్టాం. ఇంక చేతిలో చిల్లిగవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మృతదేహానని ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story