బ్లాక్‌మెయిలర్‌కు భయపడి సోదరి ఫోటోలు పంపిన యువతి!
ఓ యువకుడు ఇన్‌స్టాగ్రాంలో మార్ఫింగ్ ఫోటోలు పెడతానంటూ యువతిని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో భయపడిన యువతి సోదరి బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు తీసి యువకుడుకి పంపింది. దాన్ని అవకాశంగా చేసుకుని ఆ యువకుడు మరింత వేధించాడు. వేధింపులు మితిమీరడంతో ఆ యువతి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇంటర్మీడియట్ వరకు చదివి ప్రస్తుతం పాన్‌షాపులో పని చేస్తున్నాడు. చదువుకొనే సమయంలో ఓ యువతితో క్లోజ్‌గా ఉండేవాడు. ఆ సందర్భంలో ఆమెతో కలిసి దిగిన ఫోటోలు దాచిపెట్టుకున్నాడు. తాజాగా ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడీ ద్వారా యువతికి పంపి తనకు నగ్న ఫోటోలను పంపాలని బెదిరించాడు. లేదంటే మార్ఫింగ్‌చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో భయపడ్డ యువతి తన సోదరి బట్టలు మార్చుకుంటుండగా ఫొటోలు తీసి అతనికి పంపింది. దాన్ని అవకాశంగా చేసుకుని ఆ యువకుడు మరింత వేధించాడు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం ఆ యువకుడిని అరెస్టు చేశారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com