ర‌క్త‌దానం చేసిన శునకం.. ఎవ‌రికో తెలిస్తే..

ర‌క్త‌దానం చేసిన శునకం.. ఎవ‌రికో తెలిస్తే..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులకు రక్తం ఇచ్చి ప్రాణం కాపాడితే.. ఆ తృప్తి వేరే. అందుకే రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. రక్తదానం చేసి మనిషికి పునర్జన్మ ప్రసాదించడం పరిపాటి. అయితే రక్తదానం చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడడం తో పాటు ఇచ్చినవారి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఒక మనిషి ఇంకొక మనిషికి రక్తదానం చేయడం చాలా మంది చూసే ఉంటారు. కానీ ఒక శునకం ఇంకో శునకం కోసం రక్తదానం చేయడం ఎక్కడైనా విన్నారా.. పోని చదివారా..! అనారోగ్యంతో బాధపడుతున్న ఓ శునకం ప్రాణం నిలబెట్టేందుకు మరో శునకం రక్త దానం చేసింది. చదవటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటన చర్ఛనీయాంశమైంది.

చెన్నైకి చెందిన డానీ అనే 13 ఏళ్ల శునకం కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. దీంతో య‌జ‌మాని కోల్‌కతాకు తీసుకెళ్లి డానీకి వైద్యం ఇప్పించాడు. డానీకి ఆప‌రేష‌న్ చేయాలని డాక్టర్లు తెలిపారు. అయితే చికిత్స‌లో భాగంగా డానీకి ర‌క్తం అవ‌స‌ర‌మైంది. శునకాలకు ర‌క్తం దొరకటం చాలా క‌ష్ట‌ం. అయితే ఈ విష‌యం తెలిసుకున్న అనింద్య చ‌ట‌ర్జీ.. త‌న పెంపుడు శునకం సియా ర‌క్త‌దానం చేస్తుంద‌ని తెలిపాడు. అందుకు సియా సిద్దంగా ఉంద‌ని కూడా చెప్పాడు. సియా నుంచి 15 నిమిషాల పాటు ర‌క్తాన్ని సేక‌రించి డానీకి ఎక్కించారు వైద్యులు. దీంతో డానీ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. సియా చేసిన ప‌నికి య‌జ‌మానిగా అనింద్య గ‌ర్వ‌ప‌డుతున్నా.. అంటూ సోషల్ మీడియలో ఫోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మ‌నిషికి, మ‌నిషి సాయం చేస్తే మాన‌వ‌త్వం అంటారు. అదే ఒక కుక్క‌కు మ‌రో కుక్క సాయం చేస్తే.. దాన్ని కుక్క‌త‌త్వం అంటారేమో! అంటూ' నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story