నా క్యూట్ బంగారం పేరేంటో తెలుసా..

నా క్యూట్ బంగారం పేరేంటో తెలుసా..

జమైకా దిగ్గజ స్పింటర్ ఉసేన్ బోల్ట్ కి జూన్ 14న ఓ పాప పుట్టింది. బుధవారం తన భార్య కాసీ బెన్నెట్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కూతురు ఫోటోను షేర్ చేసి పేరు ప్రకటించాడు. " నా స్వీట్ డార్లింగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఈ రోజు నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా. నేను నీ ఆనందాన్ని తప్ప మరేదీ కోరుకోను. నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తా. అది నా బాధ్యత కూడా. మేము మా కూతురు 'ఒలింపియా లైట్నింగ్' తో కొత్త జీవితాన్ని ప్రారంభించాం అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని ప్రకటించాడు ఉసేన్. జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్.. ఉసేన్ దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు. దశాబ్ధకాలం పాటు పురుషుల స్పింట్ లో తన హవాను చాటిన బోల్డ్ 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్డ్ 2008,2012,2016లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పసిడి పతకాలు సాధించిన ఏకైక స్పింటర్ గా చరిత్ర సృష్టించాడు.

Tags

Read MoreRead Less
Next Story