అంతర్జాతీయం

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా
X

బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్‌ అనెజ్‌‌కు కరోనా సోకింది. దీంతో దక్షిణ అమెరికాలో కరోనా సోకిన దేశాధ్యక్షుల సంఖ్య రెండుకు చేరింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంగళవారం ప్రకటించారు.

తాజాగా 53 ఏళ్ల జీనిన్‌ అనెజ్‌‌కు కరోనా వచ్చింది. జీనిన్‌ అనెజ్‌‌ మంత్రివర్గంలో నలుగురు మంత్రులుకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధ్యక్షురాలు జీనిన్‌ అనెజ్‌‌కు కూడా పరీక్షలు చేయించుకున్నారు. అయితే రిపోర్టులో పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యిందని జీనిన్‌ అనెజ్‌ ప్రకటించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్‌ నుంచి విధులు నిర్వర్తిస్తానని ఆమె తెలిపారు. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటానని ఆమె ట్వీట్‌ చేశారు.

బొలీవియాలో సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు కరోనా సోకడం గమనార్హం. అక్కడ సెప్టెంబర్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 43 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES