తాజా వార్తలు

తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు!

తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు!
X

తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాగల మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story

RELATED STORIES