ఒక్కరోజులో 65వేల పాజిటివ్ కేసులు..

ఒక్కరోజులో 65వేల పాజిటివ్ కేసులు..

ఒక్కరోజులో 65 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం వైరస్ తన ప్రతాపాన్ని తగ్గించలేదనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాని కరోనా ఇంకా వణికిస్తూనే ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిన్న ఒక్కరోజే 65,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బారిన పడిన వారిసంఖ్య 3,21,19,999కి చేరుకుంది. 16 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా, మరో 14,26,428 మంది కోలుకున్నారు. గురువారం 960 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,35,822 కు చేరుకుంది. కాగా అమెరికాలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటి సారి.

Tags

Read MoreRead Less
Next Story