మరో అంతుచిక్క‌ని వైరస్.. 1772 మంది మృతి : చైనా

మరో అంతుచిక్క‌ని వైరస్.. 1772 మంది మృతి : చైనా

ఒక వైపు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తుంటే.. మరోవైపు కజిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్ ప్రాణాలను బలితీసుకుంటుంది. కజకిస్థాన్‌లో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందలాది మంది మృత్యువాత పడ్డారు. క‌జ‌కిస్థాన్‌లో గుర్తుతెలియని వైరస్‌ విజృంభిస్తోందని.. న్యుమోనియా లాంటి ల‌క్ష‌ణాల‌తో జూన్ నెల‌లో 600 మందికి పైగా మరణించారని.. జాగ్రత్తగా ఉండాలని చైనా ఆ దేశ‌ ప్రజలను హెచ్చరించింది.

ఈ వైరస్ కరోనా కంటే అత్యంత ప్రమాదకారి అని క‌జ‌కిస్థాన్‌లో నివసిస్తున్న చైనీయులను.. చైనా హెచ్చరించింది. కాగా, ఈ అంతుచిక్కని వైరస్‌తో గత ఆరు నెలల్లో 1772 మంది ప్రాణాలు కోల్పోయారనిచైనా తెలిపింది. మృతుల్లో చైనీయులు కూడా ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. వైర‌స్‌ను గుర్తించేందుకు ఆరోగ్యశాఖ వ‌ర్గాలు ప్ర‌య‌త్నిస్తున్నా ఇంత‌వ‌ర‌కు గుర్తించ‌లేక ‌పోయాయ‌ని క‌జ‌కిస్థాన్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story