19 ఏళ్ల యువ‌తితో వృద్ధుడు పరార్!

19 ఏళ్ల యువ‌తితో వృద్ధుడు పరార్!
X

ఓ వృద్ధుడు.. 19 ఏళ్ల యువ‌తిని తీసుకుతో పరార్ అయ్యాడు. తన మనవరాలి వయసున్న యువతితో కలసి వృద్ధుడు పారిపోవటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

పఠాన్ జిల్లాలో సిధాపూర్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువ‌తి జూన్ 2న బయటకు వెళ్లివస్తానని చెప్పి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. అదే సమయంలో పక్కింట్లో ఉండే వృద్ధుడు కూడా కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు పట్టించుకోలేదు. యువ‌తి మేజ‌ర్ కావ‌డంతో.. పోలీసులు కేసు కూడా న‌మోదు చేయలేదు.

ఈ క్రమంలో బాధితురాలి సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. యువతిని ముసలి వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని, ఆమెను లైంగికంగా కూడా వేధింపులకు గురి చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ పిటిష‌న్‌ను జూన్ 22న విచారించిన కోర్టు.. జూన్ 29వ తేదీ లోగా యువ‌తి ఆచూకీ క‌నుగొని హాజ‌రు ప‌ర‌చాల‌ని ఆదేశించింది. మ‌ళ్లీ ఇటీవ‌లే పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. యువ‌తి ఆచూకీ కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో మరో రెండు వారాలు గడువు ఇచ్చింది న్యాయస్థానం. జులై 13 లోపు కోర్టులో యువ‌తిని హాజ‌రుప‌ర‌చాల‌ని పోలీసుల‌కు గుజ‌రాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

RELATED STORIES