మెగాఫ్యామిలీలో సంతోషం.. చిరంజీవి చిన్నల్లుడికి..

మెగాఫ్యామిలీలో సంతోషం.. చిరంజీవి చిన్నల్లుడికి..
X

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు నటుడవ్వాలన్న మక్కువతో విజేత సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఆ చిత్రం సక్సెస్ తో మరో చిత్రం చేయడానికి సిద్దమయ్యారు కళ్యాణ్ దేవ్. రెండో చిత్రం సూపర్ మచ్చీలో నటిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరనుంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు కళ్యాణ్. అనంతరం క్వారంటైన్ పూర్తి చేసుకుని కరోనా టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్ట్ నెగెటివ్ అని రావడంతో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు. నెగెటవివ్ వచ్చిన ఆనందంలో భార్య శ్రీజను, పిల్లలను దగ్గరకు తీసుకుని సెల్ఫీ దిగారు. రిపోర్ట్ వచ్చిన తరువాతే పిల్లల వద్దకు వెళ్లానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఏ మాత్రం అనుమానం ఉన్నా పిల్లలకు, పెద్ద వారికి దూరంగా ఉండాలని పోస్ట్ లో తెలిపారు.

Next Story

RELATED STORIES