చెట్లకు డబ్బులు కాస్తున్నాయి

చెట్లకు డబ్బులు కాస్తున్నాయి

అమెరికాలో డబ్బులు చెట్లకు కాస్తున్నాయి. సామెతలా కనిపించినా.. నమ్మడానికి కష్టంగా ఉన్నా.. అది నిజమే. కరోనా వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా సంక్షోభంలో పడింది. దీంతో చేతిలో డబ్బులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరాకాలోని ఓ చిన్న పట్టణం కొత్త కరెన్సీకి శ్రీకారం చుట్టింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని టెనినో అనే చిన్న పట్టణంలో చెక్క కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. దీనికి కోవిడ్ డబ్బు అని నామకరణం చేశారు. మద్యం, పొగాకు, గంజాయి తప్ప మిగిలిన వాటన్నింటిని ఈ డబ్బుతో కొనవచ్చు. మాపుల్ వెనిర్ అనే కలప నుంచి తయారు చేసిన ఈ కరెన్సీ తెలుపు, తేల పసుపు రంగులో ఉంది. దానిపై అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ చిత్రాన్ని ముద్రించారు. స్థానిక వ్యాపారాలు నిర్వహించడం కోసం సిటీ హాల్‌లో రియల్ డాలర్ల కోసం దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. దీనిపై టెనినో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టైలర్ విట్వర్త్ మాట్లాడుతూ, ‘ఈ డబ్బు ఎక్కడికి వెళుతుందో మాకు తెలియదు. కానీ చెక్క కరెన్సీతో, మేం ఇక్కడి సమాజంలో బతకవచ్చు’ అని పేర్కొన్నారు

Tags

Read MoreRead Less
Next Story