తాజా వార్తలు

ఓఎల్ఎక్స్‌లో ఏమీ కొనొద్దు.. అమ్మొద్దు: ఏసీపీ

ఓఎల్ఎక్స్‌లో ఏమీ కొనొద్దు.. అమ్మొద్దు: ఏసీపీ
X

ఆన్ లైన్ లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే ఫ్లాట్ ఫామ్ ఓఎల్ఎక్స్‌లో ఇక వ్యాపార లావాదేవీలు జరపవద్దంటున్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్. ఇందులో మొత్తం సైబర్ నేరగాళ్లు నిండిపోయారన్నారు. మనం ఏ పోస్టింగ్ చేసినా దానిని సైబర్ నేరగాళ్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని అన్నారు. భరత్ పూర్, మేవటుకు ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఓఎల్ఎక్స్‌లో తిష్ట వేశారన్నారు. ఓఎల్ఎక్స్‌ పై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సైబరాబాద్ పోలీసులు లేక రాసినట్లు చెప్పారు. దీని కారణంగా వందల కోట్ల రూపాయలు నష్టపోయారని పోలీసులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలను నేరగాళ్లు ఎక్కువగా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని శ్రీనివాస్ తెలిపారు.

Next Story

RELATED STORIES