ఆకాశంలో అద్భుతం.. ఇప్పుడు చూడకుంటే.. మరో ఆరు వేల ఏళ్ల తర్వాతే!

ఆకాశంలో అద్భుతం.. ఇప్పుడు చూడకుంటే.. మరో ఆరు వేల ఏళ్ల తర్వాతే!

ఆకాశంలో 20 రోజుల అద్భుతం ఘటన చోటుచేసుకోనుంది. ఆకాశంలో ఓ తోకచుక్క 20 రోజుల పాటు కనువిందు చేయనుంది. ఇప్పుడు చూడకుంటే.. మరో ఆరు వేల ఏళ్ల తర్వాతే కనిపిస్తా అంటోంది తోకచుక్క నియోవైజ్‌! ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ తోకచుక్క.. తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అతి సమీపంగా వస్తుంది. ఈ క్రమంలో భారత్‌లో వాయువ్యం దిశలో జూలై 14 నుంచి 20 రోజుల పాటు ఆకాశ వీధిలో కనువిందు చేయనుంది.

సూర్యాస్తమయం తర్వాత 20 నిమిషాలు వాయువ్య భాగంలో దీన్ని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై 22-23 తేదీల్లో భూమికి 103మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని.. ఆ రోజు మరింత స్పష్టతతో చూసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తోకచుక్క చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story