వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

ప్రపంచమొత్తం ఓ వైపు కరోనా వ్యాప్తిని అడ్డుకుట్ట వేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డారు. కరోనా వ్యాక్సిన్ వివిద దేశాల్లో.. వివిద దశల్లో ఉంది. అయితే, అమెరికన్ బయోటెక్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పై జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి వాలంటీర్లకు వ్యాధినిరోదక శక్తి పెరుగుతోందని ఈ పరిశోదనలో తేలింది. అయితే, స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని ఆసంస్థ తెలిపింది. అయితే, వ్యాక్సినేషన్ తరువాత ఇది సహజమని పరిశోదకులు చెబుతున్నారు. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీని కలిగించిందని వెల్లడైంది. భద్రతా పరమైన అంశాలు కూడా ఏవీ తలెత్తలేదని అథ్యయనంలో తేలింది. ఇక ఈనెలలోనే మూడో దశ పరీక్షలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఐఏఐడీ)తో కలిసి మోడెర్నా అభివృద్ధి చేస్తోంది.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT