తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 1,676 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 1,676 పాజిటివ్ కేసులు నమోదు
X

తెలంగాణలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. అంతకంతకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 1,676 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలోనే అత్యధికంగా 788 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 224, మేడ్చల్‌లో 160 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి గురువారం ఒక్క రోజే 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 2,22,693 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 41,018 మంది కి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 27,295 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 13,328 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 396 మంది మృతిచెందారు.

Next Story

RELATED STORIES