54 శాతం కేసులు ఈ నాలుగు దేశాల్లోనే..

54 శాతం కేసులు ఈ నాలుగు దేశాల్లోనే..

ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాలు.. భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా. 54 శాతం కేసులు ఈ దేశాల్లోనే నమోదైనట్లు వెల్లడైంది. ఈ నాలుగు దేశాల్లో 43 శాతం మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 59 శాతం ఉంది. ఇండియాలో రికవరీ శాతం 63గా ఉంది. అది ఈ రోజు 63.33 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బ్రెజిల్‌లోకరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ దేశంలో సగటున రోజుకు వెయ్యి మంది మరణిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య రెండు మిలియన్లు దాటిందని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 76 వేలు దాటింది.

Read MoreRead Less
Next Story