అంతర్జాతీయం

వరద భీభత్సం.. 141 మంది మృతి

వరద భీభత్సం.. 141 మంది మృతి
X

చైనాలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాంగ్జీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు యాంగ్జీనది ఎగువ పరిధిలోని పర్వత పట్టణమైన చాంగ్కింగ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా నదుల ఎగువ ప్రాంతాలు, పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. యాంగ్జీనదితోపాటు త్రీగోర్జస్‌ రిజర్వాయర్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. చైనాలో వరద కారణంగా ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

Next Story

RELATED STORIES