తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,284 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 1,284 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 667 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 43,780 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 409కి చేరింది. కరోనా బారిన పడి కోలుకుని మొత్తం 30,607 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,765 మంది మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES