విషాదం : తల్లి చూస్తుండగానే ప్రాణాలొదిలిన యువకుడు

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడు తల్లి కళ్ళముందే కన్నుమూశారు. శ్వాస ఆడక కొడుకు నరకయాతన పడుతుంటే ఆ తల్లి గుండెలు అవిసేలా రోదించింది.ఎవరైనా కాపాడండంటూ ఆర్తనాదాలు చేసింది. కన్నపేగును కాపాడుకునేందుకు తంటాలు పడింది. కానీ ఆమె ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. తల్లి కళ్ళముందే కొడుకు ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. మాడుగుల పల్లి మండలం సలకనూరుకు చెందిన వ్యక్తి కోవిడ్ అనుమానంతో నిన్న ఉదయం ఆసుపత్రికి వచ్చారు. అతని నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది కోవిడ్ వార్డులో చేర్పించి పత్తా లేకుండా పోయారు.
శ్వాస తీసుకునేందుకు అతను ఇబ్బంది పడుతున్నా కనీసం ఆక్సిజన్ పెట్టె గతి కూడా లేదు. డాక్టర్ కాదు కదా కనీసం నర్సు కూడా ఆయనవైపు తిరిగి చూడలేదు. అసలు కరోనా నిర్ధారణ కాకుండానే అతన్ని కోవిడ్ వార్డులో చేర్చడం ఒక తప్పైతే అతని తల్లి ఎలాంటి రక్షణ లేకుండానే ఆ వార్డులోకి ప్రవేశించినా అడిగే వారు లేకుండా పోయారు. ఉదయం నుంచి సస తీసుకునేందుకు ఇబ్బంది పడిన యువకుడు చివరికి సాయంత్రం ఆరుగంటలకు ప్రాణాలు వదిలాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com