తాజా వార్తలు

క‌రోనాతో క‌న్న‌డ న‌టుడు మృతి

క‌రోనాతో క‌న్న‌డ న‌టుడు మృతి
X

ప్రముఖ కన్నడ నటుడు హ‌ల్వానా గంగాధ‌ర‌య్య(70) ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ -19 కారణంగా మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు శనివారం తెలిపాయి. ఆయన వయసు 70 ఏళ్ళు.. ఇటీవల తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ గా హ‌ల్వానా గంగాధ‌ర‌య్య 1,500 కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు..

సుమారు 120 సినిమాల్లో నటించారు. నీర్ దోసె, కురిగాలు స‌ర్ కురిగాలు, శబ్ద‌దేవి వంటి సినిమాల్లో చేసిన అద్భుత నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. గొప్ప న‌టుడిగా పేరు సంపాదించుకున్న గంగాధ‌ర‌య్య‌ 'క‌ర్ణాట‌క నాట‌క అకాడ‌మీ' అవార్డు సైతం అందుకున్నారు. దర్శకుడు-రచయిత ఎన్ సీతారామ్ హులివానా గంగాధర్ మరణానికి సంతాపం తెలిపారు.

Next Story

RELATED STORIES