చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం

హైదరాబాద్ లో ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ దేవస్థానంలో అద్భుతం చోటుచేసుకుంది. అర్చక స్వామి సురేష్ మహారాజ్ తెల్లవారుజామున గుడికి వెళ్లేసరికి స్వామివారి సన్నిధిలో తాబేలు ఉండటాన్ని గమనించారు. ఆయన వెంటనే ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు తెలిపారు. దీంతో ఆయన వచ్చి.. స్వామి చెంతకు వచ్చింది కూర్మమూర్తి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూర్మమూర్తి లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి దారి లేదని అయినా ఎలా వచ్చిందో అర్ధం కావడం
లేదన్నారు. ఈ కూర్మమూర్తి ఆలయ ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. సాగర మధనంలో హలాహలం వచ్చిందని.. దాన్ని పరమశివుడు స్వీకరించాడని అలాగే కరోనా నుంచి మనకు తొందరగా విముక్తి లభించబోతోందని.. మనకు అమృతం దొరకబోతోందని దీని సంకేతం అన్నారు రంగరాజన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com