అంతర్జాతీయం

మానవమాత్రులతో సంబంధం లేదు.. సముద్రంలో ప్రయాణం.. అయినా 57 మందికి కరోనా..

మానవమాత్రులతో సంబంధం లేదు.. సముద్రంలో ప్రయాణం.. అయినా 57 మందికి కరోనా..
X

ఎచిజెన్ మారు అనే ఫిషింగ్ నౌక 35 రోజుల క్రితం దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయా ఓడరేవు నుండి బయలుదేరింది

అనేక మంది నావికులు అనారోగ్యానికి గురైన తరువాత అది తిరిగి వచ్చింది. ఓడలో ప్రయాణించిన 61మంది నావికులకు బయలు దేరే ముందు కరోనా టెస్ట్ చేయిస్తే అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ అనూహ్యంగా 35 రోజుల నౌకా ప్రయాణం అనంతరం 61 మందిలో 57 మంది వైరస్ బారిన పడ్డారు. నౌకలో ప్రయాణించే వారెవరికీ ఆ 35 రోజులు భూమి మీద నివసించే మనుషులతో సంబంధం లేదు. అయినా వైరస్ ఎలా సోకిందో అర్థం కాక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.

నావికులు అందరూ సముద్రయానం ప్రారంభించడానికి ముందు 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండి టెస్ట్ నెగిటివ్ అని తేలిన తరువాతే బయలుదేరారు. 57 మంది నావికులు సముద్రంలో 35 రోజుల తరువాత కరోనా వైరస్ బారిన పడిన విధానాన్ని ఛేదించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోంది. కొవిడ్ లక్షణాలు బయట పడిన వెంటనే నౌకతిరిగి ఓడరేవుకు చేరుకుందని దక్షిణ టియెర్రా డెల్ ఫ్యూగో ప్రావిన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఈ సిబ్బందికి వైరస్ ఎలా సోకిందో గుర్తించడం చాలా కష్టంగా మారిందని ఫ్యూగోలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ డైరెక్టర్ అలెజాండ్రా అల్ఫారో చెప్పారు.

ప్రాంతీయ ఆసుపత్రిలో అంటు వ్యాధుల విభాగాధిపతి లియాండ్రో బల్లాటోర్ మాట్లాడుతూ 57 మంది నావికులకు వైరస్ లక్షణాలు ఎలా కనిపించాయో మేము ఇంకా వివరించలేక పోతున్నాము అని అన్నారు. కాగా, అర్జెంటీనాలో ఆదివారం మొత్తం 100,000 కేసులను దాటింది, మరణాల సంఖ్య 1,859 కు పెరిగింది. కరోనా కేసులు ఎక్కువగా బ్యూనస్ ఎయిర్స్ ప్రాంతంలో ఉన్నాయి.

Next Story

RELATED STORIES