మౌత్ స్ప్రేతో వైరస్ మటుమాయం: స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ

మౌత్ స్ప్రేతో వైరస్ మటుమాయం: స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రముఖ ఫార్మా సంస్థలన్నీ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా మౌత్ స్ప్రే ద్వారా 20 నిమిషాల్లో వైరస్ ను నిరోధించవచ్చని తెలిపింది. వైరస్ ను క్రియారహితం చేస్తుందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం తెలిపింది.

ఎంజైమాటికాకు చెందిన మౌత్ స్ప్రే కోల్డ్ జైమ్ కేవలం 20 నిమిషాల్లో వైరస్ ను 98.3 శాతం నాశనం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్ విట్రో అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్ లను నిరోధించడంలో ప్రభావ వంతంగా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. తాజా అధ్యయనంలో కొవిడ్ 19 మహమ్మారిని పూర్తిగా నాశనం చేయడంలో దీని సామర్ధ్యాన్ని అంచనా వేయనున్నామని తెలిపింది.

అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్ లో ఈ అధ్యయనం నిర్వహించినట్లు వెల్లడించింది. గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్పిన్లతో కూడిన ఈ సొల్యూషన్ ను గొంతు, నోరు లోపలికి స్ప్రే చేస్తే ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వైరస్ వ్యాప్తి కూడా బాగా తగ్గుతుందని కంపెనీ సీఈఓ క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story