గువహటి సెంట్రస్ జైలులో కరోనా వార్డు

గువాహటి సెంట్రల్ జైలులో ఓ వార్డును కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా బారినపడిన ఖైదీలకు ఈ వార్డులో చికిత్స అందించనున్నారు. ఇటీవల ఆస్పత్రిలో చేరి కరోనా చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పారిపోయిన విషయం తెలిందే. దీంతో జైలు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జైలులో చాలా మందికి కరోనా సోకింది. ఇద్దరు ఖైదీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయిన నేపథ్యంలో గువాహటి సెంట్రల్ జైలులోని ఒక వార్డును కరోనా సోకిన ఖైదీలను ఉంచేందుకు కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. అసోంలో 31 జైళ్లు ఉండగా, 481 మంది ఖైదీలకు కరోనా సోకింది. గువాహటి జైలులో అత్యదికంగా 435 మంది ఖైదీలకు కరోనా సోకిన నేపథ్యంలో జైలు వార్డునే కొవిడ్ కేంద్రంగా మార్చామని అధికారులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story