వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో.. అంతవరకు..: డబ్ల్యూహెచ్‌ఓ

వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. వ్యాక్సిన్ వస్తే మంచిదే.. కానీ ఈలోపు అశ్రద్ద వహించొద్దు. ఉన్న మందులతోనే కరోనా బారిన పడకుండా కాపాడుకుందాం. జాగ్రత్తలు పాటించి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే తక్షణ కర్తవ్యమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసన్ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ పరిశోధనను మరింత వేగవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలతో వైరస్ ను కట్టడి చేయాలని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన గత వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పదిలక్షల కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ఈ సమయంలో యూకే వ్యాక్సిన్ ఫలితాలు తుది దశకు చేరుకోవడంపై ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంటాక్ట్ ట్రేసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు టెడ్రోస్ సూచించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రతిఒక్కరికీ పంపిణీ చేసే కచ్చితమైన విధానం లేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రపంచదేశాలకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com