ప్రపంచ వాణిజ్యశక్తిగా ఎదిగే సత్తా భారత్‌కు ఉంది: అమెరికా

ప్రపంచ వాణిజ్యశక్తిగా ఎదిగే సత్తా భారత్‌కు ఉంది: అమెరికా

భారత్ కు గ్లోబల్ వాణిజ్య శక్తి ఉందని తాను విశ్వసిస్తున్నట్టు అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అన్నారు. చైనా ఏక ఛత్రాధిపత్యానికి చెక్ పెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని భారత్‌ తనవైపు తిప్పుకోగలదని అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతవరణం భారత్‌ మరింతగా సృష్టించాలని అన్నారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, వాణిజ్యం చేసేందుకు సిద్దంగా ఉన్నాయని.. అయితే, అమెరికా కంపెనీలకు అవకాశం కల్పించాలని అన్నారు. ప్రపంచదేశాలన్నింటికీ భారత్ పై అపారమైన నమ్మకం ఉందని.. ఈ నమ్మకాన్ని అవకాశంగా మార్చుకుంటే.. చైనాను పక్కకునెట్టి గ్లోబల్‌ వాణజ్య శక్తిగా భారత్ కు ఎదగగలదని అన్నారు. టెలీకమ్యూనికేషన్, వైద్య సామగ్రి సహా పలురంగాల్లో ప్రపంచదేశాల అవసరాలను తీర్చే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. భారత్ ఈ అవకాశాలను వినియోగించుకుంటే.. చైనా ఆధిపత్యానికి ముకుతాడు వేయొచ్చని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story