యజమానిపై ప్రేమతో.. ఒంటె ఒంటరిగా 100 కిలోమీటర్లు..

ప్రేమగా పెంచిన యజమాని ఒంటె వృద్ధురాలైందని దాన్ని అమ్మేశాడు. కానీ యజమానిని విడిచి వుండలేని ఒంటె 100 కిలోమీటర్లు 7 రోజుల పాటు ఎడారిలో ఒంటరిగా ప్రయాణించి అతడిని చేరుకుంది. గత ఏడాది అక్టోబరులో ఒంటెను సంతలో అమ్మేశాడు. దాని గుండెల్లో బాధ ఎంత గూడు కట్టుకుందో ఎనిమిది నెలల అనంతరం పాత యజమానిని వెతుక్కుంటూ అతడిని చేరుకుంది. ఏడు రోజులు 100 కిలోమీటర్లు నడిచి తనని చేరుకున్న ఒంటెను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందమూ కలిగింది అతడికి. అంత శ్రమకోర్చి తనని చేరుకున్నందుకు తిరిగి దాన్ని అమ్మిన యజమాని దగ్గర కొనాలని నిర్ణయించుకున్నాడు. చైనా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. నెటిజన్లు ఒంటె విధేయతకు అచ్చెరువొందారు. జంతువులు మనుషులను ఎంతో విశ్వసిస్తాయి. మానవులతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటాయి.. వాటిని మీరు బాగా చూసుకుంటే అవి మిమ్మల్ని మర్చిపోలేవు అని మరొకరు రాశారు. జంతువులు చాలా స్వచ్ఛమైనవి. దయచేసి ఇక ఎవరికీ అమ్మొద్దు జాగ్రత్తగా చూసుకోండి అని మరొకరు రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com