సంతోష్ బాబు కుటుంబంతో కేసీఆర్ భోజనం

జూన్ 15న భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధవారం సంతోషికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. అదే సమయంలో, హైదరాబాద్ ప్రాంతంలో పోస్టింగ్ చేయమని అధికారులను ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఆమె శిక్షణ పూర్తయ్యేవరకూ సంతోషికి అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సూచించారు. ప్రగతి భవన్‌లో సంతోషి కుటుంబానికి చెందిన 20 మంది సభ్యులతో కలిసి భోజనం చేశారు సీఎం.
కాగా జూన్ 15 న లడఖ్ లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందులో 18 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు అమరవీరులయ్యారు. భారత సరిహద్దు భద్రతలో భాగంగా కల్నల్ సంతోష్‌ను 18 నెలలు లడఖ్‌లో ఉంచారు. కల్నల్ సంతోష్‌కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com