నోబెల్ బ్యాంకెట్ ఈవెంట్.. 1300 మంది అతిధులతో!!

నోబెల్ బ్యాంకెట్ ఈవెంట్.. 1300 మంది అతిధులతో!!

కరోనా వచ్చి అన్ని ఆనందాలను హరించి వేసింది. పెళ్లిళ్లు, పేరంటాలు, విందులు, వినోదాలు ఏది చేయాలన్నా వైరస్ భయం వెంటాడుతోంది. అయినా అక్కడక్కడా నిబంధనలు అతిక్రమించి వేడుకలు చేసుకుంటూ మహమ్మారి బారిన పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది నోబెల్ పురస్కారాలతో పాటు అందుకున్న వారికి భారీ విందును ఏర్పాటు చేసేవారు నోబెల్ ఫౌండేషన్ సంస్థ అధికారులు. సుమారు 1300 మంది అతిధులతో స్టాక్‌హోమ్‌లో విందుకు భారీ ఏర్పాట్లు జరిగేవి. అలాంటిది ఈ ఏడాది విందు వేడుకను నిర్వహించడం లేదని ఫౌండేషన్ చైర్మన్ లార్స్ హెకెన్ స్టన్ తెలిపారు.

1956లో ఒకసారి హంగేరీపై సోవియట్ యూనియన్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ నోబెల్ గ్రహీతలకు విందు కార్యక్రమాన్ని రద్దు చేశారు. రెండు ప్రపంచ యుద్ద సమయాల్లోనూ విందు రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు కోవిడ్ కారణంగా రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. అయితే నోబెల్ పురస్కారాల కార్యక్రమం మాత్రం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు పురస్కారాలను ప్రధానం చేస్తారు. డిసెంబర్ 10న ప్రతి ఏడాది నోబెల్ బ్యాంకెట్ ఈవెంట్ ఉంటుంది. అది ఏడాది రద్దు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story