తాజా వార్తలు

కరోనా నెగిటివ్ రిపోర్టు వార్తలు అవాస్తవం : బిగ్ బి

కరోనా నెగిటివ్ రిపోర్టు వార్తలు అవాస్తవం : బిగ్ బి
X

బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు జులై 11 న కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనుమరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారంతా ముంబైలోని నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా నుంచి అమితాబ్ కోలుకున్నట్లుగా బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. తనకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్న వార్త అవాస్తవమని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు తప్పు, బాధ్యతారాహిత్యం, నకిలీ, అబద్ధంతో కూడినవని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES