సినీ నేపథ్యం లేని వారికి అవకాశాలు.. కరణ్ జోహర్ నటుల కెరీర్‌ను..: దర్శకుడు అనురాగ్ కశ్యప్

సినీ నేపథ్యం లేని వారికి అవకాశాలు.. కరణ్ జోహర్ నటుల కెరీర్‌ను..: దర్శకుడు అనురాగ్ కశ్యప్

బాలీవుడ్ లో బంధుప్రీతి.. ఈ చర్చ పదేళ్ల క్రితమే జరగాల్సింది. ఇప్పుడెందుకు.. ఇప్పుడు ఇండస్ట్రీ టాలెంట్ ఉన్న వాళ్లని ప్రోత్సహిస్తుంది. సీనీ నేపథ్యంలేని వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి అని ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రేక్షకుల చేతిలోనే నటుల భవిష్యత్తు ఉంటుందని టాలెంట్ ను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. సినిమాల్లో ఎక్కువగా కనిపించే వారినే స్టార్స్ అని పిలుస్తుంటారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ల కుమారుడు తైమూర్ కనిపిస్తే చాలు ఫొటోలు తీసేందుకు మీడియా వెంట పడుతుంది. చిన్నప్పుడే వారిని స్టార్లను చేస్తున్నారు.

బంధుప్రతి అనేది భారతీయుల డీఎన్ఏలోనే ఉంది అని అనురాగ్ పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా కరణ్ జోహార్ నటులకు కెరీర్ ను ఇవ్వగలడు కానీ నాశనం చేయడు.. కరణ్ నిర్మాతే కాదు వ్యాపార వేత్త కూడా. ఏం చేయాలనేది తనకు తెలుసు అని అన్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌వి వంటి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు పెద్ద స్టార్స్ తోనే సినిమాలు చేస్తాయని అన్నారు. కాగా, అనురాగ్ ప్రస్తుతం లస్ట్ స్టోరీస్, ఘోస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరోవైపు నటుడిగానూ పలు సినిమాల్లో కనిపించారు.

Tags

Read MoreRead Less
Next Story