కరోనావైరస్ రెండోసారి సోకదట

కరోనావైరస్ రెండోసారి సోకదట

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. అయితే ఈ మహమ్మారి ఒకసారి సోకిన తరువాత తిరిగి ఎప్పుడైనా మళ్లీ సోకుతుందా అనే ప్రశ్న ప్రపంచం మదిలో ఉంది. కొందరేమో వైరస్ అనేది ఎన్నిసార్లయినా సంక్రమిస్తుందంటారు.. మరికొందరేమో ఇది మళ్ళీ వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో కోవిడ్-19 వైరస్ మనిషికి ఒక సారి గనక సంక్రమిస్తే తిరిగి మళ్లీ సోకదని అంటున్నారు. ఒకసారి వస్తే రెండో సారి రాదని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్వహించిన పరిశోధనలో కనుగొన్నారు.

మొదటి సారి సోకినప్పుడు రోగి శరీరంలో యాంటీబాడీస్ పెరుగుతాయని.. దీంతో పాటు టీసెల్స్ కూడా వైరస్‌తో పోరాటం చేస్తాయని తేల్చారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఒకసారి సోకితే మళ్ళీ తిరిగి సోకడం కష్టమేనని అంటున్నారు. ఇదిలావుంటే దక్షిణా కొరియాలో కొందరు వ్యక్తులకు రెండో సారి కూడా కరోనా సోకిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story