అంతర్జాతీయం

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు
X

ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తోన్న కరోనా మమ్మారి ఉత్తర కొరియాలో టచ్‌లేక పోయింది. సరిహద్దు దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా ఇన్నాళ్లూ ఆ దేశంలో కనీసం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ఉత్తర కొరియాపై కూడా తన పంజా విసిరింది.

తాజాగా ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఆదివారం రాత్రి లక్షణాలున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. కాగా, ఉత్తర కొరియాలో అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం.

Next Story

RELATED STORIES