తాజా వార్తలు

హైదరాబాద్ మేయర్ కు కరోనా..

హైదరాబాద్ మేయర్ కు కరోనా..
X

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా సోకింది. ఎలాంటి లక్షణాలు లేవు. అయినా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. గతంలోనూ మేయర్ రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. తాజాగా ఆయన కారు డ్రైవర్ కు పాజిటివ్ రాగా మేయర్ కూడా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ అనంతరం ప్లాస్మా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నగరంలో వర్షాలు కురుస్తున్నందున దోమల ప్రమాదాన్ని నివారించే కార్యకలాపాలను ముమ్మరం చేయాలని వ్యాధుల వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Next Story

RELATED STORIES