తాజా వార్తలు

తెలంగాణాలో కొత్తగా 1473 కరోనా కేసులు

తెలంగాణాలో కొత్తగా 1473 కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9817 శాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా 1473 కరోనా నిర్ధారణ అయింది.. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 506 కరోనా కేసులు వచ్చాయి. మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 55,532కి చేరగా.. గత 24 గంటల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 471కి చేరింది. రంగారెడ్డిలో 168, వరంగల్ అర్బన్‌లో 111, సంగారెడ్డి జిల్లాలో 98, కరీంనగర్‌లో 91, మేడ్చల్ 86, నిజామాబాద్‌లో 41 కేసులు నమోదయ్యాయి. డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతం 12,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,63,242 టెస్టులు చేశారు.

Next Story

RELATED STORIES