చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెంచే బాదాం మిల్క్..

చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెంచే బాదాం మిల్క్..

పిల్లలు కషాయాలు తాగమంటే తాగరు. మరి వాళ్లకి ఇష్టమైన పాలల్లోనే కొద్దిగా మార్పులు చేసి ఇస్తే తాగుతారు. దీంతో వారిలో కూడా ఇమ్యూనిటి పెరుగుతుంది. కరోనా వైరస్ లాంటి మహమ్మారి నుంచి దూరంగా ఉండొచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

గ్లాసు పాలు తీసుకొని అందులో బాదం పౌడర్ 1 స్పూన్, పసుపు చిటికెడు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, మిరియాలపొడి చిటికెడు, ఇలాచి పొడి చిటికెడు, బెల్లం పొడి రెండు టీ స్పూన్లు కలిపి కొద్ది సేపు స్టౌ మీద పెట్టి మరిగించాలి. ఓ రెండు పొంగులు వచ్చే వరకు వుంచి దించాలి. దీన్ని గోరు వెచ్చగా పిల్లలకు ఇస్తే ఇష్టంగా తాగుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story