మాజీ ప్రధాని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు: మలేషియా హైకోర్టు

మలేసియా మాజీ ప్రధాన మంత్రి డటుక్ సేరి నజీబ్ రజక్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని మలేసియన్ హైకోర్టు తీర్పు చెప్పింది. 42 మిలియన్ల మలేసియన్ రింగిట్‌ల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆయనపై వచ్చిన ఆరోపణలు రుజవయ్యాయని హైకోర్టు తెలిపింది. ఆయన అధికార దుర్వనియోగానిక పాల్పడలేదని డిఫెన్స్ నిరూపించలేకపోయిందని హైకోర్టు తెలిపింది. విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త లో టేక్ ఝోను మాజీ ప్రధాని నజీబ్ నిందించడం సరికాదని తెలిపింది. పూర్వపు 1ఎండీబీ యూనిట్ ఎస్ఆర్‌సీ ఇంటర్నేషనల్ నుంచి ఆర్ఎం 42 మిలియన్లు
దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధాని మంత్రికే ఉంటుంది. అయితే, ప్రధానిగా నజీబ్ బాధ్యతలు చేపట్టిన తరువాతే ఈ నేరం జరిగింది. నజీబ్ అధికార దుర్వినియోగం, నమ్మకాన్ని వమ్ము చేయడం, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినట్లు హైకోర్టు తీర్పు చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com