ప్రభుత్వాన్ని 900 మిలియన్ పౌండ్లు అడిగిన టాటా స్టీల్!

ప్రభుత్వాన్ని 900 మిలియన్ పౌండ్లు అడిగిన టాటా స్టీల్!

టాటా స్టీల్ కంపెనీ యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వాన్ని బెయిల్ అవుట్ ప్యాకేజీ అడిగింది. అక్కడి తమ కంపెనీ నిర్వహించాలంటే 900 మిలియన్ పౌండ్లు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలని తెలిపింది. అందుకు బదులుగా కంపెనీలో ఈక్విటీ స్టేక్ తీసుకోవాలని సూచించింది. 50శాతం వరకూ అక్కడి టాక్స్ పేయర్స్ కు ఈక్విటీ రూపంలో ఇస్తామంటోంది టాటా కంపెనీ. దీని వల్ల వేల్స్ లో ఉన్న టాల్ బోట్ స్టీల్ వర్క్స్ తో పాటు.. కంపెనీ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుందని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా టాటా స్టీల్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నెల్లోనే 500 మిలియన్ పౌండ్లు బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం వెల్ష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్టు కథనం రాసింది ఓ ప్రముఖ పత్రిక. ప్రస్తుతం టాటా స్టీల్ కంపెనీలో 8355 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూకేలో స్టీల్ కంపెనీల బెయిల్ అవుట్ ప్యాకేజీ పరిమితంగా ఉంది. దీనిని పెంచాలని అక్కడి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ప్యాకేజీ వాల్యూ పెంచితే వర్క్ ఫోర్స్ ను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు ఎంపీలు. టాటా స్టీల్స్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీకి అక్కడి ప్రభుత్వం సానుకూలంగా ఉందా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story