కొక్కొరోక్కో.. కరోనా వచ్చింది.. కోడికి డిమాండ్ పెరిగింది..

కరోనా వచ్చిన తొలినాళ్లలో కిలో చికెన్ ధర రూ.50 లన్న కొనే వారు లేరు. ఇప్పుడు కిలో రూ.270 పలుకుతోంది. ఇక హైదరాబాదులో నాటుకోడి ధర అయితే కిలో రూ.500 కి అమ్ముతున్నారు. కరోనా చికిత్సలో భాగంగా రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు నాటుకోడి ఉపయోగపడుతుందని తెలిసి జనం ఎగబడుతున్నారు. దాంతో నాటుకోడి ధర కొండెక్కి కూర్చుంది. కోళ్ల దిగుమతి తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా ప్రభావంతో ప్రజల జీవనశైలి కూడా మారింది. దీంతో ప్రొటీన్ నిమిత్తంగా రోజుకి సుమారు ఒక కోటికి పైగా కోడిగుడ్లు అమ్ముడవుతున్నాయని నగర వ్యాపారులు చెబుతున్నారు. ఇక నిమ్మకాయలైతే రోజుకి 20 క్వింటాళ్లవరకు కొనుగోళ్లు జరుపుతున్నామని తెలిపారు. విటమిన్ సి కోసం నిమ్మకాయను విరివిగా వాడుతున్నారు. మటన్, నాటుకోడికి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉందని మాంసాహార వ్యాపారస్తులు అంటున్నారు. సరఫరాలో కొరత ఏర్పడడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com