తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 509 కేసలు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 492 కు చేరింది. కొత్తగా నమోదైన సంఖ్యను కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 58,906 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో 43,751 మంది కోలుకున్నారు. మరో 14,663 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని బుధవారం రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటిన్‌లో వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,97,939 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES