అంతర్జాతీయం

గూగుల్ ఉద్యోగులు.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు..

గూగుల్ ఉద్యోగులు.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు..
X

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రస్తుత పరిస్థితిలో ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడం మంచిదని భావిస్తోంది గూగుల్ సంస్థ. ఇప్పటికే తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన ఈ టెక్ దిగ్గజం.. తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించింది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈమెయిల్స్ పంపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ కార్యాలయాల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్లను ఇది ఊరటనిచ్చే అంశం. గూగుల్ తీసుకున్న నిర్ణయం మరి కొన్ని కంపెనీలపైనా ప్రభావం చూపనుంది.

Next Story

RELATED STORIES