మరోసారి వక్రబుద్ది చూపిన పాక్.. సయ్యద్‌ అలీ గిలానీకి పాక్ అత్యున్నత పురస్కారం

మరోసారి వక్రబుద్ది చూపిన పాక్.. సయ్యద్‌ అలీ గిలానీకి పాక్ అత్యున్నత పురస్కారం

పాకిస్థాన్‌.. భారత్‌ను ఎంత శత్రవుగా భావిస్తుందో మరోసారి బయటపడింది. భారత్ వ్యతిరేక శక్తులకు పాకిస్థాన్ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. తాజా భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికి శతవిధాల ప్రత్నించి.. దీని కోసం అనేక కుట్రలు చేసిన వేర్పాటువాది సయ్యద్‌ అలీ గిలానీని గౌరవంతో సత్కరించింది. కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్న గిలానీకి పాకిస్తాన్‌ ప్రభుత్వం.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఈ- పాకిస్తాన్’ అనే బిరుదుకు గిలానీని ఎంపిక చేసింది.

కశ్మీర్‌ కల్లోలానికి పరోక్ష కారణం సయ్యద్‌. అటువంటి వారికి పాక్ అత్యున్నత పురష్కారం ప్రకటించడం చాలా దారుణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసి ఆగస్టు5 నాటకి ఏడాది పూర్తి కానుంది. అయితే, ఏడాది పూర్తి కావడాని వారం ముందు ఈ అవార్డును ప్రకటించడం గమనార్హం. కాగా ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 16 పార్టీల కూటమి అయిన హురియత్‌ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా.. చాలాకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న గిలానీ ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తరువాత అనిశ్చితిలో పడిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story