థియేటర్లు తెరిస్తే.. జీవితం రిస్క్ లో పడ్డట్టే: సురేశ్ బాబు

థియేటర్లు తెరిస్తే.. జీవితం రిస్క్ లో పడ్డట్టే: సురేశ్ బాబు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెలియకుండానే కొవిడ్ బారిన పడుతున్నారు. కేసులు కూడా రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇట్లాంటి సమయంలో థియేటర్లు తెరవడమంటే రిస్క్ ని కోరి తెచ్చుకోవడమే. ఆగస్ట్ 1 నుంచి థియేటర్లు తెరుచుకుంటాయని కథనాలు వినిపించినా ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచేందుకు నిర్మాతలు మొగ్గు చూపడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా థియేటర్లను లీజుకు తీసుకున్న అగ్ర నిర్మాత సురేశ్ బాబు సైతం థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్దంగా లేరు. 3

గంటల పాటు జనాన్ని థియేటర్లో కూర్చోబెట్టి వాళ్ల జీవితాలను రిస్క్ లో పెట్టకూడదని సురేశ్ బాబు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. కేసులు తగ్గుముఖం పట్టాయని చైనాలో జాగ్రత్తలు తీసుకుని థియేటర్లు ఓపెన్ చేసి మళ్లీ వెంటనే మూసేశారు. దీన్ని మనమంతా ఓ ఉదాహరణగా తీసుకోవాలని ఆయన అన్నారు. వ్యాపార ధోరణి పక్అకన్నిటికంటే విలువైంది జీవితం అని ఆయన అన్నారు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదని సురేశ్ అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story