ఆగస్టు10కి తొలి కరోనా వ్యాక్సిన్!

ఆగస్టు10కి తొలి కరోనా వ్యాక్సిన్!

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ సిద్దం చేశామంటోంది రష్యా. ఆగస్టు 10-12 మధ్య దీనిని మార్కెట్లోకి తీసుకొస్తామంటోంది ఆ దేశం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ 19 తీవ్రత అధికం కావడంతో పాటు... మరణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై చాలా దేశాలు పనిచేస్తున్నాయి. సాధ్యమయినంత త్వరగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకరావాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా రేసులో చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ మీడియా సంస్థ RIA నొవాస్తీ కూడా వారం పదిరోజుల్లో వ్యాక్సిన్‌ అనుమతులు వస్తాయని ప్రకటన చేసింది.

ఆగస్టు 15-16 తేదీల్లో అందుబాటులో రావొచ్చని వెల్లడించింది. దీంతో పాటు.. రష్యన్‌ వైరాలజీ ల్యాబ్‌ కూడా డెవలప్‌ చేస్తున్న వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ మొదలుపెట్టింది. జులై 27న ఫస్ట్ ట్రయల్స్‌ చేసింది. అయితే త్వరలో వచ్చే వ్యాక్సిన్‌ ను సాధ్యమైనంత ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఒప్పందాలు చేసుకుంటోంది కంపెనీ.

దేశీయంగా 3కోట్ల డోస్‌లు తయారుచేయడంతో పాటు.. వివిధదేశాల్లో 17 కోట్ల డోస్‌ల కోసం కొన్ని కంపెనీలతో MOUలు చేసుకుంది. వ్యాక్సిన్‌ విషయంలో పుతిన్‌ సీరియస్‌గా ఉన్నారని... పరిశోధనలు వేగవంతం చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇండియా సహా చాలాదేశాలు వ్యాక్సిన్‌పై నిరంతరం శ్రమిస్తున్నాయి.. మారి మార్కెట్లోకి ఏది త్వరగా వస్తుందన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story