మాస్క్ ధరించినా.. నోరు దుర్వాసన..

మాస్క్ ధరించినా.. నోరు దుర్వాసన..

మీ నోరు దుర్వాసన వస్తుంది అని చెప్పాలంటే ఏమైనా అనుకుంటారేమో అని ఫీలింగ్.. కానీ ఎవరిది వారికి తెలియదు.. చెప్పడం మంచిదేనేమో. కడుపులో అజీర్ణ సమస్యలు వుంటే నోరు దుర్వాసన వస్తుంది. ఇప్పుడు అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు కాబట్టి వారి నోటి దుర్వాసన వారికే తెలుస్తుంది. దుర్వాసనను నివారించడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

సోంపు: యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న సోంపును అన్నం తిన్న తరువాత ఓ స్పూన్ నోట్లో వేసుకుని నములుంతుంటే నోరు వాసన రాకుండా ఉంటుంది.

దాల్చిన చెక్క: ఇందులో ఉన్న నూనె కారణంగా నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసన రాకుండా చేస్తుంది. చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 1-2 ఏలకులు కొద్దిగా నీటిలో వేసి మరిగించాలి. చల్లని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ఓ లవంగం బుగ్గన పెట్టుకుని నములుతూనో, చప్పరిస్తూనే ఉన్నా నోటిని దుర్వాసన తగ్గుతుంది. లవంగం టీ తయారు చేసుకుని దాంతో మౌత్ వాష్ చేసుకున్నా దుర్వాసన రాదు. కప్పు నీటిలో 1 టీస్పూన్ లవంగ పొడి వేసి 5-10 నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత దానితో రోజుకు రెండు సార్లు నోటిని శుభ్రం చేసుకోవాలి.

అన్నింటికంటే ముఖ్యమైంది ప్రతి రోజు సరిపడినంత నీరు తాగాలి. దీంతో కడుపులో జీర్ణం కాని పదార్ధాలు బయటకు వెళ్లడానికి నీరు తోడ్పడుతుంది. గోరు వెచ్చని నీరు తాగితే మలబద్దకాన్ని నివారించి నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story