బంగారం ధర 2300డాలర్లకు చేరుకుంటుంది : గోల్డ్‌మెన్‌ శాక్స్‌

బంగారం ధర 2300డాలర్లకు చేరుకుంటుంది : గోల్డ్‌మెన్‌ శాక్స్‌

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర వచ్చే ఏడాదికల్లా 2300డాలర్లకు చేరుకుంటుందని ప్రముఖ సంస్థ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అంటోంది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను మరింత డౌన్‌గ్రేడ్‌ చేస్తుందన్న అంచనాలతో పాటు భౌగోళికంగా నెలకొన్న అనిశ్చితి కారణంగానే బంగారం ధరల ర్యాలీకి దారి తీస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా బంగారం ధర 27శాతం పెరిగింది. అర్థిక వ్యవస్థ రికవరీతో పాటు.. ఇన్ ఫ్లేషన్ కూడా పెరుగుతోంది. డాలర్‌ బలహీనపడుతోంది. మరోవైపు బంగారం ETFలోకి హెడ్జింగ్‌ ఇన్‌ఫ్లోలు పెరిగాయి. అదే సమయంలో ఏకానమిలో లిక్విడిటిని పెంచేందుకు అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను మరింత డౌన్‌గ్రేడ్‌ చేయవచ్చన్నది అంచనా. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు కరోనా కేసులు తగ్గుముఖపట్టకపోవడం వంటి కారణాలు బంగారానికి కలిసొచ్చే అంశాలు. పసిడితో పాటు.. సిల్వర్ ప్రైస్ అవుట్‌లుక్‌ను కూడా పెంచింది గోల్డ్ మాన్ శాక్స్. వచ్చే ఏడాదిలోగా ఔన్స్‌ వెండి ధర 30డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. బంగారం ధర పెరుగుదలతో పాటు సోలార్‌ ఎనర్జీ పరిశ్రమలో వెండి వినియోగం పెరుగుతుందనే అంచనాలు వెండి ధర పరుగులు పెట్టిస్తుందని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story